సింగపూర్‌లో 2025 మే 3న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని లారెన్స్ వాంగ్ నేతృత్వంలోని అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) మరోసారి విజయం సాధించింది.
దీంతో ప్రధానిగా మరోసారి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆ దేశంలో దాదాపు 26 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సింగపూర్‌లో ఓటేయడం తప్పనిసరి.
లారెన్స్ వాంగ్ (52) 2024లో సింగపూర్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ఆర్థిక మంత్రిగానూ ఆయన సేవలందిస్తున్నారు.