పట్టణ పేద మహిళల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ‘సఖీ సురక్ష’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాలతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో సఖీ సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరాలు, పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 26.53 లక్షల మంది మహిళలను ఉద్దేశించి దీన్ని రూపొందించింది. తొలి దశలో వీరిలో లక్ష మందికి జీవనశైలి వ్యాధులపై పరీక్షలు చేయించడంతోపాటు వైద్యం అవసరమైన వారిని ఆసుపత్రుల్లో చేర్పించడం ప్రధాన ఉద్దేశం.