సుఖోయ్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో (హాల్) రూ.13,500 కోట్ల ఒప్పందాన్ని రక్షణశాఖ కుదుర్చుకుంది.
2024, డిసెంబరు 12న కుదిరిన ఈ ఒప్పందం ద్వారా 12 సుఖోయ్ అత్యాధునిక యుద్ధ విమానాలు వాయుసేనకు అందుతాయి.
రష్యాకు చెందిన ఈ విమానాల్లో 62.6 శాతం స్థానికంగా తయారైన విడిభాగాలనే వాడతారు.