ఆంధ్రప్రదేశ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో బిందు, తుంపర్ల సేద్యం అమలు చేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది.
తర్వాతి స్థానాల్లో గుజరాత్ (1.16 లక్షల హెక్టార్లు), ఉత్తర్ ప్రదేశ్ (1.02 లక్షల హెక్టార్లు), కర్ణాటక (97,400 హెక్టార్లు), తమిళనాడు (90,800 హెక్టార్లు) ఉన్నాయి.
దేశంలో సూక్ష్మ సేద్యం పరికరాలు అత్యధికంగా ఉన్న తొలి పది జిల్లాల్లో అనంతపురం, వైఎస్సార్ కడప, సత్యసాయి, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి.
గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లా దేశంలో తొలి స్థానంలో ఉండగా అనంతపురం రెండో స్థానంలో నిలిచింది.