స్క్వాష్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న తొలి ఆసియా జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. 2025, డిసెంబరు 14న చెన్నైలో జరిగిన ఫైనల్లో భారత్ 3-0తో హాంకాంగ్‌పై విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో సీనియర్ క్రీడాకారిణి జోష్న చిన్నప్ప 3-1 (7-3, 7-5, 7-1)తో లీ కాయిని ఓడించగా.. అభయ్ సింగ్ పురుషుల సింగిల్స్‌లో 3-0 (7-1, 7-4, 7-4)తో అలెక్స్ లవును చిత్తు చేశాడు.
భారత బృందం క్వార్టర్స్‌లో దక్షిణాఫ్రికాను, సెమీస్‌లో ఈజిప్ట్‌ను ఓడించింది. ఇప్పటిదాకా 2023లో మూడో స్థానంలో నిలవడమే భారత్‌కు టోర్నీలో ఉత్తమ ప్రదర్శన.