ప్రధాని నరేంద్ర మోదీ 2025, ఫిబ్రవరి 21న స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్ (సోల్) సదస్సును దిల్లీలో ప్రారంభించారు.
దేశానికి ప్రతిరంగంలో ప్రపంచస్థాయి శక్తిసామర్థ్యాలున్న నాయకుల అవసరముందని ఆయన అన్నారు.
భారత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచస్థాయి పరిష్కారం చూపగల సత్తా వారికి ఉండాలని సదస్సులో పేర్కొన్నారు.
వర్ధమాన రంగాలైన డీప్‌టెక్, అంతరిక్షం, బయోటెక్, సంప్రదాయేతర ఇంధనం లాంటి రంగాలతో పాటు సంప్రదాయ రంగాలైన క్రీడలు, వ్యవసాయం, ఉత్పత్తి, సామాజిక సేవా రంగాల్లోనూ నాయకత్వాన్ని తయారు చేయాల్సిన అవసరముందని చెప్పారు.