కొత్తతరం హైపర్‌సోనిక్ క్షిపణి అస్త్రాల ఇంజిన్లలో వాడే స్క్రామ్‌జెట్ కంబస్టర్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. హైదరాబాద్‌లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన డీఆర్‌డీఎల్ ప్రయోగశాలలో ఈ పరీక్ష జరిగింది. స్క్రామ్‌జెట్ కంబస్టర్‌ను నేలపై వెయ్యి సెకన్లకుపైగా పరీక్షించారు. ఇది విజయవంతం కావడంతో.. గగనతల పరీక్షకు అనువైన పూర్తిస్థాయి కంబస్టర్ టెస్టింగ్‌కు మార్గం సుగమమైనట్లు రక్షణ శాఖ 2025, ఏప్రిల్ 25న పేర్కొంది.