Published on Dec 30, 2025
Apprenticeship
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు

సికింద్రాబాద్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ)- దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్‌ వర్క్‌షాప్‌/ యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 4232 (ఎస్సీ- 635, ఎస్టీ- 317, ఓబీసీ- 1143, ఈడబ్ల్యూఎస్‌- 423, యూఆర్‌- 1714)

వివరాలు:

1. ఏసీ మెకానిక్- 143

2. ఎయిర్ కండిషనింగ్- 32

3. కార్పెంటర్- 42

4. డీజిల్ మెకానిక్- 142

5. ఎలక్ట్రానిక్ మెకానిక్- 85

6. ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్- 10

7. ఎలక్ట్రీషియన్- 1053

8. ఎలక్ట్రికల్ (ఎస్‌&టి) (ఎలక్ట్రీషియన్)- 10

9. పవర్ మెయింటెనెన్స్ (ఎలక్ట్రీషియన్)- 34

10. ట్రైన్‌ లైటింగ్ (ఎలక్ట్రీషియన్)- 34

11. ఫిట్టర్- 1742

12. మోటార్ మెకానిక్ వెహికల్ (ఎంఎంవీ)- 08

13. మెషినిస్ట్- 100

14. మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ (ఎంఎంటీఎం)- 10

15. పెయింటర్‌- 74

16. వెల్డర్- 713

ఎస్‌సీఆర్‌ యూనిట్ ప్రదేశాలు: సికింద్రాబాద్, లల్లాగూడ, మెట్టుగూడ, ఖాజీపేట, హైదరాబాద్, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, కాకినాడ పోర్టు, కొండపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి, రాయనపాడు, నల్లపాడు, గుంటూరు, గుంతకల్, తిమ్మనచర్ల, యాద్‌గిర్‌, నాందెడ్‌, పూర్ణ జంక్షన్, ముద్‌ఖేడ్‌.

అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత. 

వయోపరిమితి: 28.12.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పదోతరగతి, ఐటీఐలో సాధించి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంది.

దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27-01-2025.

Website:https://scr.indianrailways.gov.in/

Apply online:https://onlineregister.org.in/instructions.php