Published on Sep 30, 2024
Walkins
సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్ కాలేజీలో ల్యాబ్‌ టెక్నీషియన్ పోస్టులు
సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్ కాలేజీలో ల్యాబ్‌ టెక్నీషియన్ పోస్టులు

సికింద్రాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12

వివ‌రాలు:

1. సైంటిస్ట్‌ సి (మెడికల్/ నాన్‌ మెడికల్) - 03

2. డీఈఓ (డేటా ఎంట్రీ ఆపరేటర్)- 02

3. రిసెర్చ్‌ అసోసియేట్‌- 01

4. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌- 02

5. రిసెర్చ్‌ అసిస్టెంట్‌- 02

6. ల్యాబ్‌ టెక్నీషియన్- 01

7. ప్రాజెక్ట్‌ టెక్నికల్ ఆఫీసర్‌ III- 01

అర్హత: సంబంధిత విభాగాల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు సైంటిస్ట్‌ సి పోస్టుకు రూ.67,000; డీఈఓకు రూ.20,000; రిసెర్చ్‌ అసోసియేట్‌కు రూ.56,840; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ. 32,350- 33,700; రిసెర్చ్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ టెక్నికల్ ఆఫీసర్‌ పోస్టులకు రూ.28,000; ల్యాబ్‌ టెక్నీషియన్‌కు రూ.20,000.

ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు గడువు: 05-10-2024.

ఇంటర్వ్యూ తేదీ: 08-10-2024.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా గాంధీ మెడికల్ కాలేజ్‌, ప్రిన్సిపల్, జీఎంసీ, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి.

Website:https://gmcsecunderabad.org/