ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్ ఛాంగి ఎయిర్‌పోర్ట్ వరుసగా రెండో ఏడాదీ అగ్రస్థానంలో నిలిచింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్- 2026 ప్రకారం.. రెండో స్థానంలో ఇన్చాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (దక్షిణ కొరియా), మూడో స్థానంలో టోక్యో హనేడా ఎయిర్‌పోర్ట్ (జపాన్) నిలిచాయి. ప్రపంచంలోని 10 అత్యుత్తమ విమానాశ్రయాల్లో హాంకాంగ్ విమానాశ్రయం, నరీటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జపాన్), పారిస్ షాల్ ద గోల్ ఎయిర్‌పోర్ట్ (ఫ్రాన్స్), రోమ్ విమానాశ్రయం, ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్ (తుర్కియే), మ్యూనిక్ ఎయిర్‌పోర్ట్ (జర్మనీ), వ్యాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌లకూ చోటు దక్కింది.
భారత్ విమానాశ్రయాల విషయానికొస్తే.. దిల్లీ ఇందిరాగాంధీ ఇంçర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ఈ జాబితాలో 28వ స్థానం దక్కింది. గతేడాది ఇది 32వ స్థానంలో ఉంది.