విద్యార్థినులకు సిక్కిం విశ్వవిద్యాలయం రుతుక్రమ సెలవు మంజూరు చేసింది. తమ వర్సిటీలో చదువుతున్న విద్యార్థినులు నెలకు ఒక రోజు దీన్ని వినియోగించుకోవచ్చునని పేర్కొంది.
ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ లక్ష్మణ్ శర్మ 2024, డిసెంబరు 7న ప్రకటన విడుదల చేశారు.