Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 27, 2026
Current Affairs
సిక్కింలో 11 రకాల కొత్త తూనీగలు
సిక్కింలో 11 రకాల కొత్త తూనీగలు
  • సిక్కిం విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక శాస్త్రీయ అధ్యయనంలో ఆ రాష్ట్రంలో మొదటిసారిగా 11 కొత్త రకాల తూనీగలను (డ్రాగన్‌ ఫ్లై), వెదురుగొట్టం తూనీగలను (డ్యామ్సెల్‌ ఫ్లై) గుర్తించారు. వీటిని ఓడొనేట్స్‌గా వర్గీకరిస్తారు. పర్యావరణానికి కీలక సూచికలుగా పరిగణిస్తారు. వీటి జీవిత చక్రం నీటిపై, భూమిపై సాగుతుంది. వీటి లార్వాలు వాగులు, చెరువులు వంటి మంచినీటి ఆవాసాలలో పెరుగుతాయి.
  • ఉభయచర జీవిత చక్రం కారణంగా వాటి ఉనికి.. పర్యావరణ స్థితిని, నీటి నాణ్యతను ప్రతిబింబిస్తుంది. ఓడోనేట్లు లార్వా, ప్రౌఢ దశల్లో సహజ బయోకంట్రోల్‌ ఏజెంట్లుగా పనిచేస్తాయి.