సమాచార ప్రధాన కమిషనర్ (సీఐసీ)గా మాజీ ఐఏఎస్ అధికారి, న్యాయశాఖ మాజీ కార్యదర్శి రాజ్‌కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, డిసెంబరు 15న రాష్ట్రపతి భవన్‌లో ఆయనతో ప్రమాణం చేయించారు.
అనంతరం 8 మంది నూతన సమాచార కమిషనర్లతో రాజ్‌కుమార్ గోయల్ కమిషన్ కార్యాలయంలో ప్రమాణం చేయించారు.
తాజా నియామకాలతో దాదాపు 9 ఏళ్ల తర్వాత కేంద్ర సమాచార కమిషన్‌లో పోస్టులన్నీ పూర్తి స్థాయిలో భర్తీ అయ్యాయి.