Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 10, 2026
Government Jobs
సీఐపీఈటీలో లెక్చరర్‌ పోస్టులు
సీఐపీఈటీలో లెక్చరర్‌ పోస్టులు

ప్రభుత్వరంగ సంస్థకు చెందిన హైదరాబాద్‌లోని స్రెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్‌ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ) ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్‌, అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌, అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 11

వివరాలు:

లెక్చరర్‌ (ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ)- 01

లెక్చరర్‌ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌)- 01

లెక్చరర్‌ (ట్రిపుల్‌ ఈ)- 01

లెక్చరర్‌ (మ్యాథమెటిక్స్‌)- 01

లెక్చరర్‌ (ఇంగ్లిష్‌)- 01

లెక్చరర్‌ (కెమిస్ట్రీ)- 01

లెక్చరర్‌ (సీఏడీ/సీఏఎం)- 01

అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌- 01

అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌- 01

ఇన్‌స్ట్రక్టర్‌ (స్కిల్‌ డెవెలప్‌మెంట్‌)- 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ/ పీజీ డిప్లొమా, బీఈ/ బీటెక్‌, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. 

జీతం: నెలకు లెక్చరర్‌ పోస్టులకు రూ.30,000- రూ.35,000; ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.25,000- రూ.30,000; అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌కు రూ.20,000- రూ.25,000; అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌కు రూ.35,000.

వయోపరిమితి: 65 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 28-03-2026.

Website:https://www.cipet.gov.in/