Published on May 25, 2025
Government Jobs
సీఐఓఆర్‌లో టెక్నికల్‌ స్టాప్‌ పోస్టులు
సీఐఓఆర్‌లో టెక్నికల్‌ స్టాప్‌ పోస్టులు

కేరళలోని ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ పరిధిలోని సీఐఓర్‌ బోర్డ్‌ సెంట్రల్‌ కాయర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అలప్పుజ, కేరళ, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాయర్‌ టెక్నాలజీ, బెంగళూరు కర్ణాటకలో కాంట్రక్ట్‌ ప్రాతిపదికన ప్రాజెక్ట్‌/ టెక్నికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి అర్హలైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 22

వివరాలు: 

పోస్టులు: టెక్స్‌టైల్‌ టెక్నాలజిస్ట్‌, డిజైన్‌ అసిస్టెంట్‌, ఫిట్టర్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-అనలిటికల్‌ కెమిస్ట్‌, ప్రాజెక్ట్‌ హెల్పర్‌, ట్రైనర్‌, ఇన్‌స్ట్రక్టర్‌, బాయిలర్‌ ఆపరేటర్‌, స్టోర్‌ అసిస్టెంట్‌, లైబేరియన్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగం/ ట్రేడులో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు టెక్స్‌టైల్‌ టెక్నాలజిస్ట్‌, డిజైన్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు రూ.28,000; బాయిలర్‌ ఆపరేటర్‌, స్టోర్స్‌ అసిస్టెంట్‌, లైబ్రేరియన్‌కు రూ.25,000; ఇతర పోస్టులకు రూ.20,000.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 20-06-2025.

Website: http://coirboard.gov.in/