భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దక్షిణ ప్రాంత ఛైర్మన్‌గా 2026-27కు డాన్‌ఫోస్ ఇండియా ప్రెసిడెంట్ రవిచంద్రన్ పురుషోత్తమన్ ఎన్నికయ్యారు. డిప్యూటీ ఛైర్మన్‌గా సైయెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ బొదనపు ఎన్నికయ్యారు. రవిచంద్రన్ నాయకత్వంలో దాదాపు 4,000 మంది ఉద్యోగులు, నాలుగు గ్లోబల్ కాంపిటెన్స్ కేంద్రాలు, ఆరు కర్మాగారాలు ఉన్నాయి.