భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ విభాగం ఛైర్మన్(2025-26)గా రాచమల్లు ఫోర్జింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.
శివప్రసాద్ రెడ్డి 2025, మార్చి 8న ఎన్నికయ్యారు. రక్షణ, అంతరిక్ష రంగాలకు అవసరమైన ముఖ్యమైన ఫోర్జింగ్ విడి భాగాలను దేశీయంగా తయారు చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.
వైస్‌ఛైర్మన్‌గా రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ ఎం.గౌతమ్ రెడ్డి ఎన్నికయ్యారు. పర్యావరణహిత సేవల రంగంలో ఈయనకు 27 ఏళ్ల అనుభవం ఉంది. వీరిద్దరూ ఏడాది వరకూ ఈ పదవుల్లో కొనసాగుతారు.