భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఏపీ ఛైర్మన్‌గా గన్నమనేని మురళీకృష్ణ నియమితులయ్యారు. 2025, మార్చి 20న విశాఖలో నిర్వహించిన సీఐఐ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మురళీకృష్ణ ప్రస్తుతం ఫ్లూయెంట్‌గ్రిడ్ సంస్థ వ్యవస్థాపకులు, సీఈవోగా ఉన్నారు. సీఐఐ ఏపీ పూర్వ ఛైర్మన్, మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఎండీ డా.వి.మురళీ కృష్ణ నుంచి ఇదే రోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు.
అలాగే వైస్ ఛైర్మన్‌గా ఎస్.నరేంద్ర కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన అపెక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ ఏడాదిపాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు.