కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ - సీఐఎస్‌ఎఫ్) అనేది కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే పోలీస్ విభాగం. ముఖ్యమైన ప్రభుత్వ, పారిశ్రామిక భవనాలకు భద్రత కల్పించడం దీని విధి. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక దళంగా గుర్తింపు పొందింది. దీని ఏర్పాటుకు గుర్తుగా ఏటా మన దేశంలో మార్చి 10న ‘సీఐఎస్‌ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం’గా (CISF Raising day) నిర్వహిస్తారు. దేశ భద్రత, కీలక ఆస్తుల రక్షణలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది చేస్తోన్న కృషిని గుర్తించడం, వారిని గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
వివిధ రంగాల్లో భద్రతా సవాళ్లను పరిష్కరించడంలో సీఐఎస్‌ఎఫ్ ముఖ్య భూమిక పోషిస్తోంది. ఉగ్రవాదం - విపత్తులను ఎదుర్కోవడం, కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించడం లాంటి బహుళ కార్యక్రమాలను సీఐఎస్‌ఎఫ్ చేపడుతోంది. రానున్న సవాళ్లకు అనుగుణంగా కొత్త వ్యూహాలు రచించడం, ముప్పును సామరస్యంగా ఎదుర్కోవడం లాంటి అనేక పనులు చేస్తుంది. ఇది ఏర్పాటైనందుకు గుర్తుగా ఏటా మార్చి 10న ‘సీఐఎస్‌ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు.