న్యూదిల్లీలోని సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
వివరాలు:
1. అకాడమిక్ కన్సల్టెంట్- 01
2. లీగల్ ఆఫీసర్- 01
3. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్- 01
4. సిస్టమ్ అనలిస్ట్- 01
5. ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్- 01
6. అకౌంట్స్ ఆఫీసర్ (ఆడిట్)- 01
7. అసిస్టెంట్ ఎడిటర్- 01
8. ప్రూప్ రీడర్- 01
9. డిజైనర్ ఫర్ పబ్లికేషన్- 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఎల్‌ఎల్‌బీ, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంకాం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: అకాడమిక్ కన్సల్టెంట్, అకౌంట్స్ ఆఫీసర్‌కు 65 ఏళ్లు; లీగల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎడిటర్‌కు 60ఏళ్లు; ప్రూప్ రీడర్‌కు 50 ఏళ్లు, ఇతర పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు అకాడమిక్ కన్సల్టెంట్, లీగల్ ఆఫీసర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టులకు రూ.60,000- రూ.75,000; పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్‌కు రూ.50,000- రూ.60,000; ప్రూప్‌రీడర్, డిజైనర్ ఫర్ పబ్లికేషన్‌కు రూ.35,000.
ఎంపిక ప్రక్రియ: టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 05-05-2025.
Website:https://www.sanskrit.nic.in/