న్యూదిల్లీలోని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం (సీఎస్‌యూ) ఆదర్శ్ సంస్కృత మహావిద్యాలయాలు, ఆదర్శ్ సంస్కృత శోధ్ సంస్థాన్‌లోని వివిధ విభాగాల్లో నాన్-టీచింగ్, ఇతర అకాడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 43
వివరాలు:
1. కాలేజ్ లైబ్రేరియన్- 05
2. సెక్షన్ ఆఫీసర్- 01
3. అసిస్టెంట్- 14
4. ప్రొఫెషనల్ అసిస్టెంట్- 01
5. అప్‌పర్ డివిజన్ క్లర్క్ - 03
6. లోయర్ డివిజన్ క్లర్క్ - 18
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, నెట్/పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టైపింగ్ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
జీతం: నెలకు ఎల్‌డీసీలకు రూ.19,000- రూ.63,200; యూడీసీలకు రూ.25,500- రూ.81,100; అసిస్టెంట్ / ప్రొఫెషనల్ అసిస్టెంట్: రూ.35,400 - రూ.1,12,400; సెక్షన్ ఆఫీసర్‌కు రూ.44,900- రూ.1,42,400; కాలేజ్ లైబ్రేరియన్‌కు రూ.57,700- రూ.1,82,400.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 27-02-2026.
Website:https://www.sanskrit.nic.in/