Published on Dec 27, 2025
Government Jobs
సీఎస్ఐఆర్ - సీసీఎంబీలో ఉద్యోగాలు
సీఎస్ఐఆర్ - సీసీఎంబీలో ఉద్యోగాలు

హైదరాబాద్‌ హబ్సిగూడలోని సీఎస్ఐఆర్- సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 07

వివరాలు:

1. ప్రాజెక్ట్ అసిస్టెంట్‌-1: 01 

2. ప్రాజెక్ట్ అసోసియేట్‌-1: 01

3. సీనియర్ రిసెర్చ్‌ ఫెలో: 03

4. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌: 02

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 35 నుంచి 40 ఏళ్లు.

జీతం: నెలకు పోస్టులను అనుసరించి 18,000 - రూ.42,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 30.

Website:https://www.ccmb.res.in/Careers/Project-Positions