ఒడిశాలోని సీఎస్ఐఆర్- ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ ( సీఎస్ఐఆర్ - ఐఎంఎంటీ) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 13
వివరాలు:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జెన్/ఎఫ్&ఏ/ఎస్&పీ)
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి/ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు, టైపింగ్ వచ్చి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 28 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జెన్/ఎఫ్&ఏ)కు రూ.19,900 - రూ. 63,200, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్&పీ) పోస్టుకు రూ.35,804.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08-02-2025.