Published on May 28, 2025
Walkins
సీఎస్‌ఐఆర్‌ ఫోర్త్‌ పారడైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు
సీఎస్‌ఐఆర్‌ ఫోర్త్‌ పారడైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన ఫోర్త్‌ పారడైమ్ ఇన్‌స్టిట్యూట్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 06

వివరాలు:

1. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జనరల్‌): 01

2. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): 01

3. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(స్టోర్స్‌ అండ్‌ పర్చెస్‌): 02

4. జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌(ఇంగ్లిష్‌/ హిందీ): 02

అర్హత: టెన్‌+2, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత, కంప్యూటర్‌ టైపింగ్‌, స్టెనోగ్రఫి ఫరిజ్ఞానం ఉండాలి.

జీతం: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు రూ.19,900- రూ.63,200; జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500-రూ.81,100.

వయోపరిమితి: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు; జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు 27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ప్రొఫిషియన్సీ టెస్ట్‌, కంప్యూటర్‌ టైపింగ్‌ స్పీడ్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 17.06.2025.

Website:https://csir4pi.res.in/