Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 19, 2026
Walkins
సీఎస్‌ఐఆర్ - ఐఐసీటీలో ఉద్యోగాలు
సీఎస్‌ఐఆర్ - ఐఐసీటీలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని ప్రఖ్యాత పరిశోధనా సంస్థ సీఎస్‌ఐఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), వివిధ స్పాన్సర్డ్ ప్రాజెక్టులలో తాత్కాలిక ప్రాతిపదికన పని చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 13

వివరాలు:

సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ (I & II), & ప్రాజెక్ట్ అసిస్టెంట్ విభాగాలు.

విద్యార్హతలు: పోస్టులను బట్టి కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లేదా ఇంజనీరింగ్ విభాగాల్లో పీజీ (M.Sc/M.Pharm/B.Tech) లేదా పీహెచ్‌డీ (PhD) ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని పోస్టులకు నెట్ (NET/GATE) అర్హత లేదా పని అనుభవం అవసరం.

వేతనం: ఎంపికైన వారికి నెలకు రూ.20,000 నుంచి రూ.42,000 వరకు (ప్లస్ హెచ్‌ఆర్‌ఏ) గౌరవ వేతనం లభిస్తుంది.

వయోపరిమితి: పోస్టును బట్టి 35 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

ఇంటర్వ్యూ వివరాలు:

తేదీ: ఫిబ్రవరి 24, 2026 (మంగళవారం).

సమయం: ఉదయం 09:30 గంటలకు రిపోర్ట్ చేయాలి.

వేదిక: సీఎస్‌ఐఆర్ - ఐఐసీటీ (CSIR-IICT), తార్నాక, హైదరాబాద్.

గమనిక: అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తు ఫారంతో పాటు, తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

Website:https://www.iict.res.in/CAREERS