సీఎస్ఐఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (సీఎస్‌ఐఆర్-ఐఐఐఎం), జమ్మూకశ్మీర్ కింది సైంటిస్టు, హిందీ ఆఫీసర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
వివరాలు:
1. సైంటిస్టు: 12
2. హిందీ ఆఫీసర్: 01
3. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ( హిందీ), పీహెచ్ డీ (బోటని, బయోటెక్నాలజి, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, టాక్సికాలజీ, బైయోసైన్స్ మొదలైన విభాగాలు)ల్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: సైంటిస్ట్ పోస్టుకు 32 ఏళ్లు, హిందీ ఆఫీసర్ పోస్టుకు 35 ఏళ్లు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుకు 28 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు హిందీ ఆఫీసర్ కు రూ.56.100-రూ.1,77,500, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుకు రూ.19,900-రూ.63,200.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23-02-2025.