Published on Dec 15, 2025
Government Jobs
సీఎస్ఐఆర్- ఏఎంపీఆర్‌ఐలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు
సీఎస్ఐఆర్- ఏఎంపీఆర్‌ఐలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

భోపాల్‌లోని సీఎస్ఐఆర్- అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్‌ అండ్‌ ప్రొసెసెస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఏఎంపీఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 13  

వివరాలు:

1. టెక్నికల్‌ అసిస్టెంట్‌: 05

2. టెక్నీషియన్‌: 08

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు డిప్లొమా, బీఎస్సీ; టెక్నీషియన్‌ పోస్టులకు టెన్త్‌, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు టెక్నికల్‌ అసిస్టెంట్‌కు రూ.66,500; టెక్నీషియన్‌కు రూ.37,000. 

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్‌, రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 04-01-2026.

Website:https://ampri.res.in/hi/