Published on Feb 22, 2025
Apprenticeship
సీఎస్‌ఐఆర్‌-ఎస్‌ఈఆర్‌సీ చెన్నైలో అప్రెంటిస్‌ పోస్టులు
సీఎస్‌ఐఆర్‌-ఎస్‌ఈఆర్‌సీ చెన్నైలో అప్రెంటిస్‌ పోస్టులు

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌- స్ట్రక్చురల్‌ ఇంజినీరింగ్ రీసెర్చ్‌ సెంటర్‌ (సీఎస్‌ఐఆర్‌-ఎస్‌ఈఆర్‌సీ) వివిధ విభాగాల్లో ఐటీఐ, గ్రాడ్యుయేట్, ట్రేడ్ అప్రెంటిస్‌, జేఆర్‌ఎఫ్‌/ప్రాజెక్టు అసోసియేట్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 38

వివరాలు:

విభాగాలు: ఎల్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, మెకానిక్‌ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్, డ్రాట్స్ మాన్(సివిల్), వైర్‌ మెన్‌, ప్లంబర్‌, వెల్డర్‌, మేషన్‌ మొదలైనవి.

1. ట్రేడ్(ఐటీఐ) అప్రెంటిస్‌ షిప్‌: 16

2. టెక్నీ్షియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌ షిప్‌: 13

3. గ్రాడ్యుయేట్‌ (డిగ్రీ) అప్రెంటిస్‌ షిప్‌: 02

4. జూనియర్ రీసెర్చ్‌ ఫెలోషిప్‌: 01

5. ప్రాజెక్టు అసోసియేట్-1: 04

6. ప్రాజెక్టు అసోసియేట్-2: 03

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌(సివిల్‌), ఎంఈ, ఎంటెక్‌లో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 2025 మార్చి 3వ తేదీ నాటికి ఐటీఐ అప్రెంటీస్‌కు 14 ఏళ్లు, డిప్లొమా అప్రెంటిస్‌కు 24 - 24 ఏళ్లు, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు 21 - 26 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు ఐటీఐ అప్రెంటస్‌కు రూ.10,500, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.12,000, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.13,000, జూనియర్ రీసెర్చ్‌ ఫెలోకు రూ.37,000, ప్రాజెక్టు అసోసియేట్-1కు 25,000, ప్రాజెక్టు అసోసియేట్‌-2కు రూ.35,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

వేదిక: సీఎస్‌ఐఆర్‌- స్ట్రక్చురల్‌ ఇంజినీరింగ్ రీసెర్చ్‌ సెంటర్‌(CSIR-SERC), సీఎస్‌ఐఆర్‌ రోడ్, తారామణి, చెన్నై-600113. 

ఇంటర్వ్యూ తేదీ: 03-03-2025.

Website:https://serc.res.in/csir-recruitment