ఝార్ఖండ్‌లోని సీఎస్ఐఆర్- నేషనల్ మెటలార్జికల్ ల్యాబొరేటరీ గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రేయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 22
వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 13
టెక్నీషియన్ అప్రెంటిస్: 09
విభాగాలు: మెటలార్జికల్ ఇంజినీరింగ్, కెమికల్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్ డిగ్రీ, ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు ఇప్పటికే అప్రెంటిషిప్ అర్హత పొంది ఉండకూడదు.
వయోపరిమితి: టెక్నీషియన్ అప్రెంటిస్‌కు 18 నుంచి 24 ఏళ్లు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు 21 నుంచి 26 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300; టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.10,900.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఎన్‌ఏటీ పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి.
ఇంటర్వ్యూ తేదీ: 31-10-2025.
వేదిక: సీఎస్‌ఐఆర్- నేషనల్ మెటలార్జికల్ ల్యాబొరేటరీ, బర్మామైన్స్, జంషెడ్పూర్.
Website:https://nml.res.in/