Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 29, 2026
Government Jobs
సీఎస్‌ఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు
సీఎస్‌ఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ  పోస్టులు

కేరళలోని భారత ప్రభుత్వ ప్రీమియర్‌ మినిరత్న షెడ్యూల్‌ -ఏ కంపెనీ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎల్‌) మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, సేఫ్టీ, హ్యూమన్‌ రీసోర్స్‌ తదితర విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 64

వివరాలు: 

ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీలు

విభాగాల వారీగా ఖాళీలు:

1. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (మెకానికల్): 31

2. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 11

3. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్): 4

4. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (నావల్ ఆర్కిటెక్చర్): 9

5. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (సివిల్): 3

6. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (సేఫ్టీ): 3

7. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్): 2

8. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్): 1

అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. 

వేతనం: నెలకు రూ.82,720.

వయోపరిమితి: 20.02.2026 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఫేజ్‌-1, ఫేజ్‌-2 (అబ్జెక్టివ్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌), స్కిల్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ రూ.1000; ఎస్సీ/ఎస్టీ ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 20.02.2026.

Website:https://cochinshipyard.in/