Published on Nov 9, 2024
Current Affairs
సీఎస్‌ఈ నివేదిక
సీఎస్‌ఈ నివేదిక

అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా భారత్‌లో 2024 మొదటి 9 నెలల్లోనే 3,238 మంది బలయ్యారని మేధోమథన సంస్థ సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరానిమెంట్‌ (సీఎస్‌ఈ) నివేదిక పేర్కొంది. మొత్తం 274 రోజులకు గాను 255 రోజుల్లో (93 శాతం) దేశం ఇలాంటి వాతావరణ పోకడలను ఎదుర్కొందని వివరించింది.

ప్రాణనష్టానికి తోడు ఈ వైపరీత్యాల వల్ల 32 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, 2,35,862 ఇళ్లు దెబ్బతిన్నాయని, 9,457 పశువులు బలయ్యాయని పేర్కొంది.

2023లో మొదటి 9 నెలల్లో 2,923 మంది చనిపోయారు. 18.4 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతినగా, 80,293 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 92,519 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి అని నిదేదిక వెల్లడించింది.