తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని సీఎస్‌ఐఆర్- సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎల్‌ఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
వివరాలు:
ప్రాజెక్ట్ అసిస్టెంట్-I: 01
ప్రాజెక్ట్ అసిస్టెంట్-II: 06
ప్రాజెక్ట్ అసోసియేట్-I: 03
జూనియర్ రిసెర్చ్ ఫెలో: 01
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 01
అర్హత: పోస్టును అనుసరించి టెన్త్/ఐటీఐ, సంబంధిత విభాగంలో డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు నెట్/గేట్ స్కోర్, ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్-1కు రూ.25,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్-1కు రూ.18,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్-2కు రూ.20,000; ప్రాజెక్ట్ అసోసియేట్-IIకు రూ.28,000; సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.42,000; జూనియర్ రిసెర్చ్ ఫెలోకు రూ.37,000.
వయోపరిమితి: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు 32 ఏళ్లు; జూనియర్ రిసెర్చ్ ఫెలోకు 28 ఏళ్లు; ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష తేదీ: 22.12.2025.
ఇంటర్వ్యూ తేదీ: 23.12.2025.
వేదిక: సీఎస్‌ఐఆర్-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సర్దార్ పటేల్ రోడ్, అడయార్, చెన్నై.
Website:https://www.clri.org/