కేరళలోని సెంటర్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ (సీఎండీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 07
వివరాలు:
1. ప్రాజెక్ట్ అసోసియేట్ - 05
2. డ్రాఫ్ట్స్‌మెన్ (బిల్డింగ్) - 01
3. డ్రాఫ్ట్స్‌మెన్ (ఎలక్ట్రికల్) -01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా, బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్, డ్రాఫ్ట్స్‌మెన్ (బిల్డింగ్)కు రూ.32,500 డ్రాఫ్ట్స్‌మెన్ (ఎలక్ట్రికల్) కు రూ.25,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 12-11-2025.