పశ్చిమబెంగాల్, దుర్గాపుర్‌లోని సీఎస్‌ఐఆర్- సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 42
వివరాలు:
ప్రాజెక్ట్ అసిస్టెంట్-II: 09
ప్రాజెక్ట్ అసోసియేట్-I: 14
జేఆర్‌ఎఫ్/ప్రాజెక్ట్ అసోసియేట్-1: 01
జేఆర్‌ఎఫ్/ప్రాజెక్ట్ అసోసియేట్-I/II: 01
ప్రాజెక్ట్ అసోసియేట్-II: 05
ప్రాజెక్ట్ అసోసియేట్: 01
ప్రాజెక్ట్ ఎస్‌ఆర్‌ఎఫ్: 02
ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్: 04
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 04
ప్రాజెక్ట్ సైంటిస్ట్/ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్/సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. గేట్/నెట్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
జీతం: నెలకు ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.20,000; ప్రాజెక్ట్ అసోసియేట్-Iకు రూ.25,000 - రూ.31,000; ప్రాజెక్ట్ అసోసియేట్-IIకు రూ.28,000- రూ.35,000; ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.49,000; సీనియర్ పోస్టులకు రూ.42,000-రూ.56,000.
వయోపరిమితి: ప్రాజెక్ట్ అసిస్టెంట్/అసోసియేట్‌కు 35 ఏళ్లు; సీనియర్/ప్రిన్సిపల్ అసోసియేట్‌కు 40-45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీలు: 16, 17 మార్చి 2026.
వేదిక: సీఎస్‌ఐఆర్ - సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, దుర్గాపూర్.
Website:https://www.cmeri.res.in/vacancy