భారత్‌లో అత్యుత్తమ 5 స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్లలో అమెరికా సాంకేతికత దిగ్గజం యాపిల్‌కు తొలిసారి చోటు లభించింది.
సైబర్ మీడియా రిసెర్చ్ (సీఎంఆర్) నివేదిక ప్రకారం వివో, షియోమీ, శామ్‌సంగ్‌లు భారత్‌లో దిగ్గజ బ్రాండ్లుగా తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. ఇప్పుడు వీటి సరసన యాపిల్ కూడా చేరింది.
అమెరికా, చైనా తర్వాత యాపిల్‌కు ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద విపణిగా భారత్ అవతరించనుంది.
2024లో భారత్‌కు యాపిల్ ఎగుమతులు 34-35 శాతం పెరిగి 1.2 కోట్ల యూనిట్లకు చేరాయి.
2023లో ఈ సంఖ్య 90 లక్షలు అని ఐడీసీ గణాంకాల ప్రకారం తెలుస్తోంది.