Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 14, 2026
Current Affairs
సీఈ20 క్రయోజెనిక్‌ ఇంజిన్‌ పరీక్ష విజయవంతం
సీఈ20 క్రయోజెనిక్‌ ఇంజిన్‌ పరీక్ష విజయవంతం

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజెనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌-సీఈ20ని మరోసారి విజయవంతంగా పరీక్షించింది. తమిళనాడులోని మహేంద్రగిరి ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌ కేంద్రంలో ఈ ఇంజిన్‌ సముద్ర మట్టానికి సమాన ఎత్తులో 165 సెకండ్ల పాటు అవాంతరాలు లేకుండా మండించినట్లు ఇస్రో వెల్లడించింది. ఇస్రో ప్రతిష్ఠాత్మక మానవ సహిత ఉపగ్రహం గగన్‌యాన్‌ను మోసుకెళ్లే వాహక నౌకలో ఈ ఇంజిన్‌ కీలకం. 22 టన్నుల ఇంధనాన్ని 165 సెకన్లలో మండించిన ఈ ఇంజిన్‌ను మరింత ఎక్కువ పేలోడ్‌లతో పరీక్షిస్తామని ఇస్రో వర్గాలు తెలిపాయి.