Published on Feb 20, 2025
Current Affairs
సీఈసీగా జ్ఞానేశ్‌ బాధ్యతల స్వీకరణ
సీఈసీగా జ్ఞానేశ్‌ బాధ్యతల స్వీకరణ

దేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా జ్ఞానేశ్‌ కుమార్, ఎన్నికల కమిషనర్‌గా వివేక్‌ జోషీ 2025, మార్చి 19న పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఇంతవరకు ఎన్నికల కమిషనర్‌గా ఉన్న జ్ఞానేశ్‌కు సీఈసీగా పదోన్నతి లభించగా, ఆయన స్థానంలో వివేక్‌ జోషి ఎలక్షన్‌ కమిషనర్‌గా వచ్చారు.

జోషి అంతకుముందు హరియాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు.

ఎన్నికల సంఘంలో మరో కమిషనర్‌గా సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు కొనసాగుతున్నారు.