Published on Jul 27, 2024
Walkins
సీఈసీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ పర్సనల్ పోస్టులు
సీఈసీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ పర్సనల్ పోస్టులు

తమిళనాడు రాష్ట్రం కరైకుడిలోని సీఎస్ఐఆర్‌- సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిపదికన  ప్రాజెక్ట్‌ పర్సనల్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
 
మొత్తం పోస్టులు: 22

వివ‌రాలు:

సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 01

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II: 01

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 16

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుకు రూ.42,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II పోస్టుకు 28,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-Iకు రూ.25,000, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.20,000.

వయోపరిమితి: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు 40 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I పోస్టులకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు 50 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీలు: 05-08-2024, 06-08-2024.

వేదిక: సీఎస్‌ఐఆర్‌- సీఈసీఆర్‌ఐ, కరైకుడి.

Website:https://www.cecri.res.in/Default.aspx