Published on Nov 18, 2024
Government Jobs
సీఈఐఎల్‌లో ఇంజినీర్ పోస్టులు
సీఈఐఎల్‌లో ఇంజినీర్ పోస్టులు

మహారాష్ట్రలోని సర్టిఫికేషన్‌ ఇంజినీర్స్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (సీఈఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. ఇన్‌స్పెక్షన్ ఇంజినీర్‌
2. సీనియర్ ఆఫీసర్
3. అసోసియేట్-1/2/3

విభాగాలు: క్వాలిటీ అసురెన్స్/ క్వాలిటీ కంట్రోల్, ఫైనాన్స్‌ అండ్ అకౌంట్స్‌, హ్యుమన్ రిసోర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో డిప్లొమా, సీఏ, బీఈ/బీటెక్ (మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్‌/ప్రొడక్షన్), బీబీఏ, బీసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని ఉండాలి.

వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

పని ప్రదేశాలు: ముంబయి, దిల్లీ.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.

ఈమెయిల్:recruit.hr3@ceil.co.in

చివరి తేదీ: 28-11-2024.

వెబ్‌సైట్‌:https://ceil.co.in/