ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ(సీఈఎస్‌సీఆర్) అధ్యక్షురాలిగా మాజీ దౌత్యవేత్త ప్రీతిసరన్ ఎన్నికయ్యారు. సీఈఎస్‌సీఆర్ అనేది సభ్యదేశాల ఆర్థిక, సామాజిక హక్కులపై అంతర్జాతీయ ఒప్పందాల అమలును పర్యవేక్షించే బాధ్యత కలిగిన ఐరాస కీలక సంస్థ. ఇది ఐరాస మానవహక్కుల పరిపాలనా విభాగం నియంత్రణలో పనిచేస్తుంది. ఇండియన్ ఫారిన్ సర్వీసులో 36 సంవత్సరాలు విశిష్ట సేవలందించిన సరన్ భారత్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు.