రాజస్తాన్ పిలానీలోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈఈఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం పోస్టుల సంఖ్య: 16
వివరాలు:
1. ప్రాజెక్ట్ అసోసియేట్-I: 01
2. ప్రాజెక్ట్ అసిస్టెంట్-II/I: 07
3. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 03
4. జూనియర్ రిసెర్చ్ ఫెలో: 03
5. ప్రాజెక్ట్ అసోసియేట్-I/II: 02
అర్హతలు: పోస్టును అనుసరించి టెన్త్, ఐటీఐ సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, బీవీఎస్సీ/బీఫార్మసీ, ఎండీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు రూ.25,000- రూ.42,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.18,000; సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.57,000; జూనియర్ రిసెర్చ్ ఫెలోకు రూ.37,000.
వయోపరిమితి: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 50 ఏళ్లు; జేఆర్‌ఎఫ్‌కు 30 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 26-02-2026.
Website: https://www.ceeri.res.in/