మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు, దేశ ఎగుమతులను బలోపేతం చేసే లక్ష్యంతో ‘షీట్రేడ్స్ ఇండియా హబ్’ను ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఫియో) 2025, మార్చి 11న ప్రారంభించింది.
ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ భాగస్వామ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది.
బ్రిటన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న షీట్రేడ్స్ కామన్‌వెల్త్+ కార్యక్రమం దీనికి నిధులు సమకూరుస్తుంది.
అంతర్జాతీయంగా 20వ షీట్రేడ్స్ హబ్ కోసం ఆతిథ్య సంస్థగా ఫియో వ్యవహరించనుంది.