షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ ఇంధిరా గాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌ఈఐజీఆర్‌ఐహెచ్‌ఎన్‌ఎస్) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 130
వివరాలు:
1. నర్సింగ్ ఆఫీసర్: 105
2. స్టోర్ కీపర్: 03
3. రేడియోగ్రాఫర్: 03
4. మెడికల్ సోషల్ వర్కర్: 01
5. టెక్నీషియన్(ఎండోస్కోపి/కొలనోస్కోపీ): 02
6. టెక్నీషియన్(న్యూక్లియర్ మెడిసిన్): 04
7. హెల్త్ ఇన్‌స్పెక్టర్: 01
8. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్: 01
9. జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 01
10. ఫార్మసిస్ట్: 01
11. టెక్నికల్ అసిస్టెంట్: 01
12. ఈసీజీ టెక్నీషియన్: 01
13. సానిటరి ఇన్‌స్పెక్టర్: 02
14. సెక్యూరిటీ గార్డ్: 01
15. రికార్డ్ క్లర్క్: 01
16. డ్రైవర్ గ్రేడ్-3: 01
17. డార్క్ రూమ్ అసిస్టెంట్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఏ, బీఎస్సీ, బీటెక్, డిప్లొమా, ఇంటర్, టెన్త్, జీఎన్‌ఎం, ఎంఏ, ఎంఎస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ, డీ ఫార్మసి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27 - 35 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.250.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20-04-2025.