Published on Sep 12, 2025
Government Jobs
షిప్పింగ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో పోస్టులు
షిప్పింగ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో పోస్టులు

షిప్పింగ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌సీఎల్‌) ముంబయి వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 75

వివరాలు:

1. అసిస్టెంట్ మేనేజర్‌: 55

2. ఎగ్జిక్యూటివ్‌: 20

విభాగాలు: మేనేజ్‌మెంట్, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌/పర్సనల్‌, లా, ఇంజినీరింగ్‌, సివిల్‌, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ, ఫైర్‌ సెక్యూరిటీ, నావల్‌ ఆర్కిటెక్ట్‌, కంపెనీ సెక్రటరీ.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ/ఎంఎంఎస్‌, సీఏ, లా, డిగ్రీ, సీఎస్‌, బీబీఏ/బీఎంఎస్‌, హెచ్‌ఆర్‌డీ/హెచ్‌ఆర్‌ఎం, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.50,000 - రూ.1,60,000, ఎగ్జి్క్యూటివ్‌ పోస్టులకు రూ.30,000 - రూ.1,20,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 సెప్టెంబర్‌ 27.

Website:https://www.shipindia.com/frontcontroller/shore