భారత్, పశ్చిమాసియా, దాని చుట్టూ ఉన్న దేశాలతో కలిసి త్వరలో షడ్భుజి కూటమి ఏర్పాటు చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఇందులో భారత్, అరబ్, ఆఫ్రికా, ఆసియా దేశాలతోపాటు మధ్యధరా దేశాలు (గ్రీస్, సైప్రస్) ఉంటాయని ప్రకటించారు. ఫిబ్రవరి 25 నుంచి ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో మంత్రి మండలి సమావేశంలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.