Published on Nov 15, 2025
Current Affairs
షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌
షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌
  • హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్‌ ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గింది. 2025, నవంబరు 14న కైరోలో జరిగిన మహిళల 25 మీటర్ల ర్యాపిడ్‌ పిస్టల్‌ విభాగం ఫైనల్లో ఇషా 30 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇషాకు ఇదే తొలి వ్యక్తిగత పతకం. 2025 ప్రపంచకప్‌ స్టేజ్‌ టోర్నీలో ఆమె స్వర్ణం, రజతం సాధించింది. 
  • ఒలింపిక్‌ ఛాంపియన్‌ యంగ్‌ జిన్‌ (కొరియా, 40 పాయింట్లు) స్వర్ణం.. యావో కియాన్‌గ్జున్‌ (చైనా, 38) రజతం గెలుచుకున్నారు.