షూటింగ్ ప్రపంచకప్ మహిళల 10మీ ఎయిర్ పిస్టల్‌లో భారత షూటర్ సురుచి సింగ్ స్వర్ణం సాధించింది.
2025, ఏప్రిల్ 8న బ్యూనస్‌ఎయిర్స్‌లో జరిగిన ఫైనల్లో 18 ఏళ్ల సురుచి 244.6 పాయింట్లు స్కోర్ చేసింది.
టోర్నీలో భారత్‌కు ఇది మూడో స్వర్ణం.
అంతకుముందు క్వాలిఫికేషన్ రౌండ్లో సురుచి 583 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
చైనా షూటర్లు కియాన్‌వి (241.9) రజతం, జియాంగ్ రాక్సిన్ (221.0) కాంస్యం నెగ్గారు.