Published on Jan 2, 2025
Current Affairs
షెంజెన్‌ దేశాల జాబితాలోకి రుమేనియా, బల్గేరియా
షెంజెన్‌ దేశాల జాబితాలోకి రుమేనియా, బల్గేరియా

రుమేనియా, బల్గేరియా దేశాలు షెంజెన్‌ జోన్‌లో పూర్తి సభ్యత్వం పొందాయి. 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత రెండు దేశాలకు ఈ జోన్‌లో పూర్తిస్థాయిలో చోటు లభించింది.

2007లోనే యూరోపియన్‌ యూనియన్‌లో చేరిన రుమేనియా, బల్గేరియాకు షెంజెన్‌లో పాక్షిక సభ్యత్వం ఉంది. 

షెంజెన్‌ అంటే.. 29 ఐరోపా దేశాల సమాఖ్య. ఇటలీ, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్‌ వంటి దేశాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ఈ జాబితాలో రుమేనియా, బల్గేరియాలు చేరాయి.