Published on Sep 1, 2025
Current Affairs
షాంఘై సదస్సు
షాంఘై సదస్సు

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) 25వ శిఖరాగ్ర సదస్సు 2025, ఆగస్టు 31న తియాన్‌జిన్‌లో లాంఛనంగా మొదలైంది. భారత్, చైనా, రష్యా, ఇరాన్, పాకిస్థాన్‌ సహా దాదాపు 26 దేశాల అగ్రనేతలు ఇందులో పాల్గొన్నారు. సెప్టెంబరు 1న ఇది ముగుస్తుంది. 

దీని పుట్టుపూర్వోత్తరాలు..

1996లో ప్రచ్ఛన్నయుద్ధం ముగిసిన తర్వాత... సరిహద్దు భద్రతా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి చైనా, రష్యా, కజకస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్‌ కలిసి ‘షాంఘై అయిదు’గా రూపుదిద్దుకున్నాయి.

2001 జూన్‌ 15న ఇందులో ఉజ్బెకిస్థాన్‌ ఆరో సభ్యదేశంగా చేరడంతో ఇది కాస్తా ‘షాంఘై సహకార సంస్థ’(ఎస్‌సీఓ)గా అవతరించింది. 

2005 జులై 5న కజకస్థాన్‌ రాజధాని ఆస్తానా వేదికగా జరిగిన ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సుకు పరిశీలకుడి హోదాలో భారత్‌కు ఆహ్వానం అందింది.  

2014 సెప్టెంబరులో తజికిస్థాన్‌లోని దుశాన్‌బేలో జరిగిన సమావేశంలో ఎస్‌సీఓ సభ్యత్వం కోసం భారత్‌ నమోదు చేసుకుంది.

ఆ తర్వాత రష్యా వేదికగా జరిగిన భేటీలో భారత్, పాకిస్థాన్‌లు పూర్తిస్థాయిలో సభ్య దేశాలుగా మారాయి.