టర్మినల్ ఆపరేటర్ ఎయిర్ కార్గో విభాగంలో శంషాబాద్ విమానాశ్రయానికి సీఐఐ స్కేల్-2025 జాతీయ పురస్కారం లభించింది. 2025, డిసెంబరు 16న జీఎమ్‌ఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో(జీహెచ్‌ఏసీ) అధికారులు దీన్ని అందుకున్నారు. శంషాబాద్ ఎయిర్ కార్గో టర్మినల్‌లో ఆపరేషనల్ ఎక్సెలెన్స్, టెక్నాలజీ వినియోగం, ఇన్‌క్లూజివిటీ, సస్టెయినబుల్ కార్గో హ్యాండ్లింగ్ విధి, విధానాలను పక్కాగా అమలు చేస్తుండడంతో ఈ అవార్డు దక్కింది.